పెందుర్తి శ్రీ సూర్యనారాయణ స్వామికి విశేష పూజలు పెందుర్తి, ఫిబ్రవరి 3 (ఫోకస్ న్యూస్) స్థానిక వెంకటాద్రి దిగువన గల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాఘ రెండవ ఆదివారం పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు వెలివెల జగన్నాథ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. రంగ స్వామివారికి పంచామృత అభిషేకములుఅర్చనలు, అష్టోత్తరం, సూర్య నమస్కారములు, విశేష అలంకరణ చేశారు. ఆలయ రాజపురోహితుడు రాపర్తి నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు, ఆలయ అధ్యక్షులు పుసులూరి రాజగోపాలరావు, కార్యదర్శి గొంప గాయత్రి, బి.సూర్యనారాయణ, అందుకూరు శ్రీధర్, మేడపాటి రామలింగేశ్వరశర్మ తారానందం తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెందుర్తి , ఫిబ్రవరి 3 (ఫోకస్ న్యూస్) జీవీఎంసీ 71 వార్డు రాజు చెరువు లో వెలసిన శ్రీ భూలోక మాంబ తీర్థ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు ,కుంకుమ, మొక్కుబడులు సమర్పించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్, శరగడం చిన్నఅప్పలనాయుడు, దాడి , రమణచిట్టి,ఎల్.బి.నాయుడు, ఆలయ అధ్యక్షులు శరగడం మహాలక్ష్మి నాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సాయంత్రం డాన్స్ బేబీ డాన్స్, బుర్రకథ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
<no title>